కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు, అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం. ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్ల సంతకాలే కీలకం..! - ప్రజా దండోర

 


కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు


అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం.. 


 ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్ల సంతకాలే కీలకం..!  

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 30 :

పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు  యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ  మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది.

 కానీ ఈమధ్య ఎ నాయకుని ప్రలోభాలకు లోంగిండో తెలియదు కానీ మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమంగా 5,800 గజాలకు విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కమిషనర్ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను వెంటనే రద్దు చేయాలని గత ఐదు రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు గురువారం బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎం డి మోసీన్, పొట్ట సురెందర్, ఎం డి అబ్దుల్ హఫీజ్ బాబా, కొక్కెర వెంకటేష్, టెకుల శీరిష నరేష్, జాల మాదవి వినోద్, ఎలుగూరి శ్వేత కిరణ్ లు సంతకాల చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.


మంగళవారం ప్రారంభమైన ఈ సంతకాల సేకరణ మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, గురువారం బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గడి బురుజులు, కోనేరు వాటి స్థలాల రక్షణకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అక్కడ అక్రమంగా వేసిన విఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని కౌన్సిల్ సమావేశంలో సైతం వాటి రద్డుకు మొదటి వరుసలో ఉంటామని, ఆ బురుజు స్థలాలు ఎవరి స్వంతం కాదని అవి ప్రజల ఆస్తి, ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.

ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు..

 చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments