ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా బక్రిద్ వేడుకలు నిర్వహించుకోవాలి - సి‌ ఐ లక్ష్మి నారాయణ


ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా బక్రిద్ వేడుకలు నిర్వహించుకోవాలి 
- సి‌ ఐ లక్ష్మి నారాయణ 


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 05 :


 కోరుట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన సర్కిల్ పరిధి శాంతి కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిఐ కే. లక్ష్మీనారాయణ హాజరైయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల, కథలాపూర్ , మేడిపల్లి ఎస్సైల ఆధ్వర్యంలో  రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా, మూడు మండలాలకు చెందిన బిజెపి ముఖ్య కార్యకర్తలతో  పీస్ కమిటీ సమావేశం మరియు అవగాహన సదస్సు  ఏర్పాటు చేసినట్లు గతంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని అలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడంలో మరియు శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ వారికి సహకరించాలని మరియు వారికి తెలిసిన ఏ విషయమైనా సంబంధిత పోలీస్ వారికి మాత్రమే డైరెక్ట్ గా గాని లేదా డైలీ హండ్రెడ్ ద్వారా గాని లేదా ఫోన్ ద్వారా గాని తెలియజేసి పోలీసు వారికి సహకరించాలని కోరారు. 


ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, దాని ద్వారా జరిగే పరిణామాల గురించి నష్టాల గురించి తెలియజేస్తూ వారికి తగిన సలహాలు సూచనలు చేశారు.

 ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై లు ఎం.చిరంజీవి, రామచంద్రం గౌడ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments