కోరుట్ల సిఐ లక్ష్మీ నారాయణను ఘనంగా సన్మానించిన డా. పేట భాస్కర్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 06 :
కోరుట్ల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కే . లక్ష్మీ నారాయణ ను తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.
బుధవారం కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు ఎం డి ముజాహిద్, భూపెల్లి నాగేశ్వరరావు, కుంచెం శంకర్, ఎలిశేట్టి గంగారెడ్డి లతో కలిసి పేట భాస్కర్ సిఐ ని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా పట్టణంలోని పలు అంశాలపై సిఐతో చర్చించి వాటి సమస్యల పరిష్కారంలో సహకరించాలని వారు కోరారు.


0 Comments