ఘనంగా డా. పేట భాస్కర్ - సుకన్య ల మనుమరాలు భవిష్య, మనుమడు వహీన్ వేదాన్స్ ల పుట్టు పంచల కార్యక్రమం 


ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి, మే 08:


ప్రజా దండోర తెలుగు దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ - సుకన్య దంపతుల కూతురు అల్లుడు సుభాషిణి - అరుణ్ కుమార్ ల పిల్లలు భవిష్య, వహీన్ వేదాన్స్ ల పుట్టు పంచల కార్యక్రమం గురువారం మెట్ పల్లి లోని వారి నివాసం లో  ఘనంగా నిర్వహించారు.





ఈసందర్భంగా పేట భాస్కర్ సుకన్య లు పిల్లలకు వారి తల్లి దండ్రులకు నూతన వస్త్రాలు బహుకరించారు. పిల్లలకు సాంప్రదాయ ప్రకారం బంగారు వస్తువులు అందజేశారు.  బంధుమిత్రుల కోలాహలం లో ఆనందంగా సాగిన ఈ వేడుకలో  పిల్లలకు పలువురు బహుమతులు అందజేశారు. అనంతరం అరుణ్ కుమార్ సుభాషిణి లు వచ్చిన అతిథులకు ఆత్మీయంగా మంచి విందు భోజనం ఏర్పాటు చేసి బంధుమిత్రులను ఆనందపర్చినారు.



ఈ వేడుకలో బొల్లారం రాజ గంగారాం -అనసూయ, అనీల్ కుమార్ -మైత్రీ, గడచంద వెంకటేష్ - పుష్ప, సుద్దాల నాగయ్య- లక్ష్మి, పేట ప్రభాస్- అను, పేట అశోక్ - లక్ష్మీ , రాపెల్లి శుభదర్శిని - సాయి సుందర్, రాగుల్ల అజేయ్ -కళ్యాణి, మునుగురి భూమయ్య - లక్ష్మి, ఆర్ వి ఛలం- అనిత, చిట్యాల రాజేష్ - గోదావరి, బొల్లే రవి -గంగు, పొడేటి వెంకటేష్ - పద్మ, లక్ష్మణ్-నర్సు, మునుగురి నరేందర్, ప్రశాంత్, ప్రణిత్ న్యాయవాది బర్ల సంతోష్, గోపి, పేట సాయి కుమార్ , అభినవ్, అనుదీప్, విష్ణు, చిట్యాల ప్రేమ్ , మనోజ్, సందీప్, వివేక్ తదితర ఆత్మీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.