అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ - ప్రజా దండోర

 


అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్


  ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి -తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు 


ప్రజా దండోర న్యూస్ / ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జీ, మే 09:

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం పెద్ద నక్కల పేట, దోనూరు, తిమ్మాపూర్, వెల్గటూర్ మండలం శాఖాపూర్ గ్రామంలోని  వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను శనివారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.


 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. 


 అదేవిధంగా రాష్ట్రంలో మరియు జిల్లాలో అకాల వర్షాలు ఉన్నందున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు  గన్ని సంచులు, టార్ఫలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రీ  ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చుడాలని అన్నారు. అదేవిధంగా మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.


 ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫాలిన్ కవర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకొని  పాడీని ప్రొటెక్ట్ చేయాలని అన్నారు.  రాష్ట్రంలో అకాల వర్షాలు ఉన్నందున ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షాలు కురిస్తే రైతులు చెట్ల కింద, కరెంటు పోల్స్ వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పరిశీలనలో  మండల తహసిల్దార్లు , సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments