మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యాన్ని అరికట్టి మౌలిక వసతులు కల్పించాలని బిజేపి డిమాండ్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 21 :
రాష్ట్రంలో దాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగూ తేమ' పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టి, యుద్దప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
కోరుట్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు కస్తూరి లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తెలంగాణలో ఆరుగాలం చెమటోడ్చి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పంట పండించిన రైతన్న పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. తాము పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల చుట్టూ వారాల తరబడి తిరుగుతూ రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ముందస్తు ప్రణాళిక లోపం కారణంగా అన్న దాతలు రోడ్లపై ధర్నాలకు, కన్నీళ్లకు, చివరికి ప్రాణత్యాగాల దిశగా నెట్టబడుతున్నారు.
ఈ క్రింది అంశాలను మీ దృష్టికి తీసుకువస్తూ, తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది.
కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల లేమి & జాప్యం: కాంటాలు, గన్నీ బ్యాగుల కొరత: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి నెల రోజులు గడుస్తున్నా కాంటాలు వేయడం లేదు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. హమాలీలు, లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పడకేసింది తొర్రమొక్కజొన్న రైతులు రోజుల తరబడి రోడ్లపైనే గడుపుతున్నారు. పంట పండించడానికి 3 నెలల 15 రోజులు పడితే, దాన్ని అమ్ముకోవడానికి మరో 2 నుండి 3 నెలలు పడుతోంది.
ఆపై బిల్లులు రావడానికి నెల రోజులకు పైగా సమయం పడుతుండటంతో రైతుల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. పిల్లల ఫీజులు, కుటుంబ, తదుపరి పంట పెట్టుబడులకు పైసల్లేక రైతులు మానసికంగా కుంగిపోతున్నారు అని తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ల తుక్కరం, 27వ వార్డ్ కౌన్సిలర్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తిరుమల వాసు, 7వార్డ్ కౌన్సిలర్ గుగ్లవత్ శ్రీకాంత్, యువ మోర్చా అధ్యక్షులు కళల సాయి చందు, ఉపాధ్యక్షులు మైలు సత్యనారాయణ, గొనె రాజారాం, తులసి కృష్ణ, బెక్కం అశోక్, గుండేటి సంజీవ్, తల్లపెళ్లి శ్రీనివాస్, రాధారపు సత్యనారాయణ, చేటపెళ్లి ఓం ప్రకాష్ ,బాల్క ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments