తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించాలి - తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ 


రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపి వేం నరేందర్ రెడ్డి లను కలిసిన జేఏసీ నేతలు గజ్జెల కాంతం, పిడమర్తి రవి, పేట భాస్కర్ మరియు ప్రతినిధి బృందం 


ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి,


 తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలని కోరుతూ వారిని గుర్తించి ప్రభుత్వం నియమించిన కే కే కమిటీ ద్వారా ఉద్యమకారుల హామీలు నేరవేర్చాలని రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యులు ( ఎంపీ ) వేం నరేందర్ రెడ్డి గార్లను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించిన తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్,  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, రాష్ట్ర వైస్ చైర్మన్, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్, ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి లతో పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం కలిశారు. 



ఈసందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర   ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తుంచుటకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం" కే. కే కమిటీ" ను నియమించారని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ గా ఉద్యమంలో అలుపెరగని పోరాటలు చేసిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాంచాలని, పించిన్ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు కల్పించాలని కోరారు.ఈకార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.