పార్టీలకతీతంగా ఊరు క్షేమం కోరుకునే కోరుట్ల కౌన్సిలర్లకు సలాం - డాక్టర్ పేట భాస్కర్ , 30 మంది కౌన్సిలర్లు గడి స్థలాల్లో విఎల్టీల రద్దుకై సంతకాలు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, మే 17 :
పురాతన కోరుట్ల గడి స్థలాలు కాపాడుకోవడం మనందరి బాధ్యత అని వాటిపై నకిలీ దస్తావేజులతో అక్రమంగా వేసిన విఎల్టీలను రద్దు చేయవల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన నిరసన దీక్షలు, రాస్తారోకో, సంతకాల సేకరణలో సహకరించి విఎల్టీలను రద్దు చేయాలని సంతకాలు చేసిన 30 మంది కౌన్సిలర్లకు కోరుట్ల ప్రజల పక్షాన సలాం చేస్తున్నామని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు సంతకాలు చేసీన 29 వ వార్డు కౌన్సిలర్ యాటం పద్మా కర్ణకర్, 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్, 9 వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ లు ముగ్గురు కౌన్సిలర్ లతో ముప్పై మార్క్ చేరుకుందని ఇంకా ముగ్గురు కౌన్సిలర్లు సంతకాలు చేస్తే కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ ల సంఖ్య 33 మంది మొత్తం కౌన్సిలర్ లు ఒక పనికి మాలిన అధికారి తప్పిదాన్ని ప్రజలతో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజేపి కౌన్సిలర్లు తమ సంతకాలతో పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం నిజంగా అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చరిత్ర సృష్టించారని చెప్పక తప్పదు...
ఇక గడి బురుజుల స్థలాల్లో వేసిన విఎల్టీలను ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ద్వారా రద్దు చేయాలని ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్ యార్డు, పార్కు, మైసమ్మ దేవాలయం నిర్మాణంతో పాటు కోనేరును, బురుజులను అభివృద్ధి చేసి కోరుట్ల ప్రజలు ఆకాంక్షలను నేరవేర్చాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను పేట భాస్కర్ కోరారు.
ఈ సంతకాల సేకరణలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, ఎం డి ముజాహిద్, చింత భూమేశ్వర్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు,సుతారి రాములు, షాహెద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్ తదితరులు పాల్గొన్నారు.



0 Comments