బదిలీపై వెళ్తున్న డీఎస్పీలకు ఘన సన్మానం, సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ - ప్రజా దండోర




బదిలీపై వెళ్తున్న డీఎస్పీలకు ఘన సన్మానం, సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

ప్రజా దండోర న్యూస్ / పేట ప్రభాస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి, మే 15 :

శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసింగ్ కార్యక్రమాల అమలులో విశేష సేవలందించిన డీఎస్పీలు రఘు చందర్, శ్రీనివాస్ లు  బదిలీపై వెళ్లనున్న సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు వారిని ఘనంగా సన్మానించారు. 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు బదిలీపై వెళ్లనున్న అధికారులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో విధులు నిర్వహించిన కాలంలో అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ జిల్లా  పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడారు. ముఖ్యంగా పండుగలు, ఎన్నికలు, ప్రత్యేక బందోబస్తు విధులు,నేర నియంత్రణ, యువతలో మత్తు పదార్థాల నిర్మూలన వంటి అంశాల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేశారని పేర్కొన్నారు. 

పోలీస్ శాఖలో ప్రతి అధికారి తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని, అదే పోలీసింగ్‌కు అసలైన గుర్తింపని ఎస్పీ గారు తెలిపారు. విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావం ఉంటే ప్రజల ఆదరణతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని  ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కొత్తగా బదిలీ అయిన ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన సేవా తత్వంతో పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని, తమ అనుభవంతో పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 



ఈ సందర్భంగా బదిలీపై వెళ్లనున్న డీఎస్పీలు కూడా జగిత్యాల జిల్లాలో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. జిల్లాలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సహకారం ఎల్లప్పుడూ లభించిందని పేర్కొన్నారు. జిల్లాలో  పని చేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని, సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీ పై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు.


ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్ ఐపీఎస్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రఘు చందర్, శ్రీనివాస్, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments