కోటి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న డాక్టర్ రఘు
ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి, ఏప్రిల్ 2 :
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో గల కోటి లింగేశ్వర స్వామిని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా వీడీసీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సందర్భంగా కమిటీ నాయకులు డాక్టర్ రఘు గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ శ్రీనివాస్, చిట్యాల శ్రీధర్, పీట్ల సాయిరాం, న్యావనంది శ్రీనివాస్, మాసుల రాకేష్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments