హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ప్రజా దండోర న్యూస్ / గొల్లపల్లి ప్రతినిధి, ఏప్రిల్ 2 :
హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని గుండు హనుమాన్ దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రిగారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో రూ. 10 లక్షలు నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఈ సందర్భంగా మంత్రి గారు ప్రారంభించారు.
గొల్లపల్లి మండలం గంగాదేవి పల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి మంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మహిళల కోరగా జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తో మాట్లాడి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి ఆదేశించారు.



0 Comments