కోరుట్లలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు - పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 2 :
కోరుట్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానములో హనుమాన్ జయంతి సందర్భంగా మూల విరాట్ కు అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఈకార్యక్రమంలో కోరుట్ల నియోజక వర్గ శాసన సభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, మాజీ ఛైర్పర్సన్, 26వ వార్డు కౌన్సిలర్ అన్నం లావణ్య-అనిల్, ఈవో విక్రమ్ జూ.అసిస్టెంట్ పి. నర్సయ్య, అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0 Comments