జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏండ్లు గడుస్తున్నా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటులో నిర్లక్ష్యం..!

 


జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏండ్లు గడుస్తున్నా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటులో నిర్లక్ష్యం..! 

- ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపణ

ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ, ఏప్రిల్ 3 :

జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని, సమాతవాది పుజ్యశ్రీ  డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇకనైనా రాష్ట్ర మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టి సారించి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు. 

ప్రతి ఏటా ఏప్రిల్ 5 న దేశ వ్యాప్తంగా అ మహానీయుని జయంతి ని ఎంతో పవిత్రంగా దళిత అనగారిన బహుజన వర్గాలు ఉత్సవాలు జరుపుకుంటారని, నూతన జిల్లాగా జగిత్యాల ఏర్పాటు జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఏండ్లు గడుస్తున్నా విగ్రహం ఏర్పాటులో ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి చౌరస్తాలో ప్రతి ఏటా పాలకులు సందర్శించి వాగ్దానాలు చేయడం తప్ప విగ్రహం ఏర్పాటు చేయడం లేదని పేట భాస్కర్ ఆరోపించారు.

జగిత్యాల మున్సిపల్ పాలకవర్గం మంచినీళ్ల చౌరస్తా వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి కుడా ఏండ్లు గడుస్తున్నాయని అ ప్రాంతానికి చెందిన జగ్జీవన్ రామ్ వారసులు, అభిమానులు విగ్రహం ఖరీదు చేసి తెచ్చినప్పటికి అక్కడ ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం గాంధీ నగర్ కుల సంఘ భవనంలో ఒంటరిగ  విలపిస్తుందని, ఈ జయంతి ఉత్సవాలలోనైన మంచినీళ్ల చౌరస్తాలో తనను నెలకోల్ఫుతారని ఆశగా ఎదురుచూస్తున్న విగ్రహాన్ని పట్టించుకోవాలని వెంటనే చౌరస్తాలో విగ్రహం ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను సమాజానికి అందించేలా కృషి చేయాలని పేట భాస్కర్ ప్రభుత్వ అధికారులకు, పాలకులకు స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments