మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ని సన్మానించిన డాక్టర్ పేట భాస్కర్ - ప్రజా దండోర

 


మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ని సన్మానించిన డాక్టర్ పేట భాస్కర్


ప్రజా దండోర న్యూస్ / డెస్క్ ఇంచార్జీ, ఏప్రిల్ 9 :


సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా తాడిత పిడిత అనగారిన  ప్రజల పక్షాన అజ్ఞాతంలో ఉద్యమించిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ లొంగిపోయిన అనంతరం మొదటి సారి తన జన్మస్థలమైన కోరుట్ల పట్టణం అంబేద్కర్ నగర్ లోని తన సొంత ఇంటికి వచ్చిన సందర్భంగా గురువారం తన తమ్ముడి నివాసంలో వున్న దేవ్ జీ ని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. 

ఈసందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు భవిష్యత్తులో రాజ్యాంగ బద్ధంగా ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మీలాంటి ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజలు అండగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు దేవ్ జీ తెలిపారని పేట భాస్కర్ అన్నారు.

ఈ సన్మానంలో పేట భాస్కర్ తో పాత్రికేయులు ఇందూరి నరేష్, నాయకులు ఎలిశేట్టి గంగారెడ్డి, ఆర్ భూమయ్య లు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments