బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రెండవసారి నియమితులైన సురభి నవీన్ కుమార్ కు కోరుట్లలో ఘన స్వాగతం
- బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికిన బిజెపి శ్రేణులు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిది ఏప్రిల్ 9 :
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన సురభి నవీన్ కుమార్ మొదటిసారి కోరుట్ల పట్టణానికి వచ్చిన సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి కోరుట్ల పట్టణంలోని తన నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు.
కోరుట్ల అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లో కార్యకర్తలనుద్దేశించి సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ బిజెపి అంటేనే కార్యకర్తల పార్టీ అని కార్యకర్తలు లేకుంటే ఏ నాయకుడు లేడని ఏ కార్యకర్తకు కష్టం వచ్చిన మీ కుటుంబ సభ్యునిగా మీ తోడుంటానని నా చివరి శ్వాస వరకు కాషాయాన్ని విడిచేది లేదని ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎదురొడ్డి పోరాడుతానని స్పష్టం చేశారు.
తనపై నమ్మకంతో రెండవ సారి బాధ్యత ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సంఘ పెద్దలకు ధన్యవాదాలు తెలియచేశారు.
ఈసందర్భంగా రెండవసారి బాధ్యతలు స్వీకరించిన సురభి నవీన్ కుమార్ ను బిజేపి శ్రేణులు ఘనంగా సన్మానించారు.



0 Comments