బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతును విజయవంతం చేయండి - మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపు

 


బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతును విజయవంతం చేయండి - జూపల్లి కృష్ణారావు


 పిడమర్తి రవితో కలిసి గోడపత్రిక విడుదల చేసిన మంత్రి జూపల్లి 


ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 9 :


ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతు విజయవంతం చేయాలని సంబంధించిన పోస్టర్ని ఎక్సైజ్ పర్యాటక మరియు సంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం నిబద్ధత పనిచేస్తుందని అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే ప్రతి పేదవారికి ప్రజా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో బషీర్ బాగ్ లో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించే బ్లూ బ్లాక్ గ్రీన్ కవాతు ను రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

పిడమర్తి రవి మాట్లాడుతూ ఏప్రిల్ 14న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే బ్లూ బ్లాక్ గ్రీన్ షర్ట్స్ కవాతును ప్రారంభిస్తున్నామని రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బోరెల్లి సురేష్, తెలంగాణ మహిళా జాగృతి అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి, నాయకులు దేవరకొండ నరేష్, బీఎస్ఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మొగిలిగిద్ద ప్రసాద్, రమేష్, ఆసిఫ్, మల్లికార్జున్, మల్లేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments