మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 10 :
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం శుక్రవారం కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి మార్క్ పెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత గంగాధర్ లతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అందులో భాగంగానే కోరుట్ల మార్కెట్ యార్డులో శుక్రవారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కావున రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించుకొని మద్దతు ధర పొందాలని సూచించారు.
కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు లు మాట్లాడుతూ రైతుల పక్షపతి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకొని మద్దతు ధర పొందాలని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0 Comments