కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ - డా పేట భాస్కర్
- జయంతోత్సవాలలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 14
బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాల పునాదులు పై కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని అ మహానీయుడి త్యాగ ఫలితమే భారత రాజ్యాంగం అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ అన్నారు.
కోరుట్లలో మంగళవారం జరిగిన అంబేద్కర్ 135 వ జయంతోత్సవాల సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ ఉత్సవాలలో పలువురు నాయకులు, అధికారులు, అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్ రావు, రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, బిజేపీ రాష్ట్ర నేత డాక్టర్ అనూప్ రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ తిరుమల వసంత గంగాధర్, వైస్ చైర్మన్ షాహేద్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రవీందర్, తహశీల్దార్ కృష్ణ చైతన్య, సిఐ సురేష్ బాబు, ఎస్సై ఎం చిరంజీవి, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అన్నం లావణ్య అనీల్, కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, బిజేపి అధ్యక్షుడు కస్తూరి లక్ష్మి నారాయణ, ఎంఐఎం అధ్యక్షుడు ఎండీ రఫీ, కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మణ్ , పొట్ట సురెందర్, తెడ్డు శ్రీజ, తిరుమల వాసు, చిట్యాల లక్ష్మి నారాయణ, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, మాల మాదిగ సంఘాల అధ్యక్షులు, పాత్రికేయులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసంగించారు.. విగ్రహ కమిటీ అధ్యక్షులు వుయ్యాల నర్సయ్య అధ్యక్షతన జరుగగా ప్రధాన కార్యదర్శి చిట్యాల లచ్చయ్య స్వాగతోపన్యాసం చేశారు.
ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను పాలకులు, అధికారులు నేరవేర్చాలని అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళులు అని అన్నారు. ఒక పక్క ప్రజల అవసరాలను తీర్చకుండ వారికి దక్కాల్సిన హక్కులను కాల రాస్తూనే మరో పక్క గొప్పలు చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఉండదని రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను ప్రజలకు అందవలసిన ఫలాలను కులమతాలకు అతీతంగా అందించాలని, అందరూ సమానమేనని చాటిచెప్పిన గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.
ప్రతిసారీ పాలకులు బాబు జగ్జీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ విగ్రహాల అభివృద్ధి కి వాగ్దానాలు చేయడం కాకుండా వాటిని అమలు చేయాలని, జగ్జీవన్ పార్కు ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కోరుట్ల గడి బురుజుల స్థలాలలో నకిలీ దస్తావేజులతో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న అక్రమ విఎల్టిలను రద్దు చేయాలని ప్రజల అవసరాల రీత్యా మార్కేట్, పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానంగా చదువుపై దృష్టి పెట్టాలని విద్య అనేది పులి పాల వంటిదని అది తాగిన వాడు గర్జించక మానడు అని నమ్మి చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నిరూపించిన అంబేద్కర్ ఆశయాలలో భాగస్వామ్యులు అవుతూ ముందుకు వెళ్లాలని పేట భాస్కర్ స్పష్టం చేశారు.
ఈసందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేటి ఉదయం దినపత్రిక ఎడిటర్ బలిజ రాజారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
ఓంకార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తాళ్ల పెళ్లి శేఖర్ మహారాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాల మధ్య మరియు వివిధ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.





0 Comments