అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్య కు పెద్ద పీట తెలంగాణలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం - మంత్రి అడ్లూరి

 


అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్య కు పెద్ద పీట తెలంగాణలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రజా ప్రభుత్వం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌తో సామాజిక సమానత్వానికి నూతన  మార్గం

తెలంగాణ పాఠ్యాంశాల్లో అంబేద్కర్ చరిత్రను చేర్చాలి

దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల శ్రేయస్సే లక్ష్యం 

- సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్


ప్రజా దండోర న్యూస్ / హైద్రాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 14:


డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా “విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం” అనే సిద్ధాంతంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని   సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నారు.

మంగళవారం డా.బి ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకల సందర్భంగా ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంక్షేమ శాఖ

మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ...

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సమానత్వం లక్ష్యంగా పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు తారతమ్యం లేకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 25 ఎకరాల్లో రూ.200 కోట్ల వ్యయంతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్” ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ పాఠశాలలు భవిష్యత్ తరాలకు సమగ్ర విద్య, వ్యక్తిత్వ వికాసానికి కేంద్రాలుగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధికి దోహదం చేస్తుందని అంబేద్కర్ పేర్కొన్న సిద్ధాంతం ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని ఆయన వివరించారు.

దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించేందుకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యల ఫలితంగా ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా దళిత విద్యార్థులు సివిల్స్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబర్చి IAS, IPSతో పాటు గ్రూప్-1, 2, 3, 4 వంటి పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు.

125 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.


Post a Comment

0 Comments