గడి బురుజుల స్థలాల్లో అక్రమ విఎల్టీలను రద్దు చేయాలని కదం తొక్కిన బిజేపి కౌన్సిలర్లు, నాయకులు
అవినీతికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముందు కార్యాలయం ఎదుట పట్టణంలోని గడి బురుజులు మరియు కోరుట్ల పట్టణ చారిత్మక కట్టడాలను కాపాడుకొనుటకు అక్కడ జరుగుతున్న అవినీతి పై బిజెపి కౌన్సిలర్ లు నాయకులు యుద్ధం ప్రకటించారు.
పట్టణంలోని కూరగాయల మార్కెట్ దగ్గరలోని గడి స్థలంలో అక్రమంగా వేసిన 5000 గజాలకు హౌస్ నెంబర్ 6 - 1- 63 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కదం తొక్కారు.. దీనిపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని కోరుట్ల పట్టణ ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని తెలియజేశారు. అనుమతులు లేకుండా భూమిని వి ఎల్ టి చేసి దానికి హౌస్ నెంబర్ వేయించి అక్రమార్కులకు అప్పచెప్పడం వెనుక కోరుట్ల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపాలిటీ సిబ్బంది హస్తం ఉందని ఆరోపించారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని నిరసనకు దిగారు.
కౌన్సిల్ సమావేశంలో సైతం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు కస్తూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అక్రమార్కుల చేతిలో ఉన్న కోరుట్ల గడి బురుజు & గ్రామ కంఠ ఆబాది కాలి భూములను కాపాడాలని అధికారులను, మున్సిపల్ చైర్మన్ ను డిమాండ్ చేశారు .ఈ సమస్యల పైన అధికారులు గానీ అధికార పార్టీ నాయకులు గానీ స్పందించకపోవడం శోచనీయమని తప్పుడు పత్రాలు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.



0 Comments