కోరుట్ల హైవే డిపార్టీ కెనాల్ బ్రిడ్జి పై ఇంతటి నిర్లక్ష్యమా..! - ప్రజా దండోర

 


కోరుట్ల హైవే డిపార్టీ కెనాల్ బ్రిడ్జి పై ఇంతటి నిర్లక్ష్యమా..!


 బ్రిడ్జికు అడ్డు గోడ లేక పొంచి వున్న ప్రమాదం .. 


 అధికారులు ప్రమాదం జరిగితే తప్ప స్పందించరా.. ?


డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ :


నిత్యం వందలాది మోటార్ వెహికిల్లతో పాటు బస్సులు, లారీల రాకపొకలతో రద్దీగా వుండే కోరుట్ల హైవే రహదారిపై వున్న డిపార్టీ కెనాల్ బ్రిడ్జి పై ఇరువైపులా అడ్డు గోడ లేక పెను ప్రమాదం పొంచి ఉందని అ రహదారిలో కెనాల్ వుందని తెలిసిన వ్యక్తులకు తప్ప కొత్త వారికి ఏమాత్రం తెలియకుండా ఒకవైపు రహదారి లెవెల్ బ్రిడ్జి నిర్మాణం వుండడం అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో అదుపుతప్పి అందులో పడితే ప్రాణాలు కోల్పోతారు. బాటసారులు సైతం అదుపు తప్పి అందులో పడితే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం.


గతంలో అలాంటి సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు స్పందించక పోవడం బాధాకరం ముఖ్యంగా ఎస్సారెస్పీ అధికారులు వారి సిబ్బంది దప దఫాలుగా పంటలకు కెనాల్ వాటర్ సప్లై కి అన్ని పరిశీలన చేసే వాటర్ వదిలే అధికారులకు ఈ బ్రిడ్జి కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.



ఇక ఆర్ అండ్ బి అధికారులు నిజామాబాద్ కరీంనగర్ తదితర పట్టణాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ హైవే రహదారి బ్రిడ్జి పై ఇంతటి నిర్లక్ష్యం తగదని వెంటనే అడ్డు గోడ నిర్మాణం చేయాలని, ఈవిషయంలో పోలీస్ శాఖ సైతం దృష్టి సారించాలని అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న అధికారులు డిపార్టీ కెనాల్ బ్రిడ్జి పై అడ్డు గోడ నిర్మాణం జరిగితే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


Post a Comment

0 Comments