కోరుట్ల మున్సిపల్ అవినీతి పై డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కు పిర్యాదు.
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి :
కోరుట్ల గడి బురుజుల స్థలాలలో నకిలీ దస్తావేజులతో జరిగిన విఎల్టీల ప్రక్రియకు దాదాపు 80 లక్షల వరకు చేతులు మారాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అవినీతి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోని విఎల్టీలను రద్దు చేయాలని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, అఖిల పక్షాల అధ్యక్షులు చెన్న విశ్వనాథం లు పిర్యాదులో పేర్కొన్నారు.
గురువారం కమీషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డా.టి కే శ్రీదేవి గారు జగిత్యాల జిల్లా పర్యటనకు వస్తున్నారనే సమాచారంతో కోరుట్ల గడి బురుజుల స్థలాల పై లక్షలాది రూపాయల లంచాలతో నకిలీ దస్తావేజులు వున్న విఎల్టీ లు వేయడం మరియు వాగు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తు అవినీతి కి పాల్పడుతున్న కమీషనర్ పై పిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమె అనివార్యకారణాల వల్ల రానందున ఈమెయిల్ మరియు వాట్సాప్ ద్వారా పిర్యాదు చేసినట్లు పేట భాస్కర్, చెన్న విశ్వనాథం లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల గడి బురుజుల స్థలాలు 3 ఎకరాల 21 గుంటల భూమిపై మున్సిపల్ అధికారులు అనుమానాస్పద పన్నుల విధానం, అక్రమ నమోదు మరియు నిర్మాణాలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కమీషనర్ వల్ల జరిగిన తప్పిదం కు ఇద్దరు ఉద్యోగస్తులు మహేష్, క్రాంతిలను డ్యూటికి రానివ్వడం లేదని విమర్శలు వస్తున్నాయని అన్నారు.
ఈ విషయం లో తమరు జోక్యం చేసుకుని అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని పిర్యాదులో పేర్కొన్నట్లు సర్వే నంబర్ లేని ఈ అబాది, గ్రామకంఠ ప్రభుత్వ గడి స్థలాలను కొందరు ప్రవేటు వ్యక్తుల ద్వారా నకిలీ ధస్తావేజులతో స్పష్టత లేకుండా కేవలం హౌస్ నంబర్ (6-1-63) ఆధారంగా వాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT) మరియు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయబడుతున్న విషయం పై ఒకే ఆస్తిని ఒకసారి నిర్మాణం ఉన్న ప్రాపర్టీగా మరియు ఖాళీ భూమిగా చూపించడం పరిపాలనా లోపం మాత్రమే కాకుండా, రికార్డుల లోపభూయిష్టతకు పరాకాష్ట గా మారిందని ఆరోపించారు.
సర్వే నంబర్ లేకుండా కేవలం హౌస్ నంబర్ ఆధారంగా పన్నులు విధించడం చట్టపరంగా సరైన విధానం కాదని గడి బురుజులు స్థలాలు జైన చాళుక్యుల నాటి సంపద మరియు ప్రజా/చారిత్రక ఆస్తి అని అలాంటి భూమిపై ప్రైవేట్ వ్యక్తుల అజామాయిషీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ రికార్డుల పారదర్శకత మరియు ప్రజల సమాచారం హక్కు దృష్ట్యా గడి స్థలాలలో జరిగిన బాగోతం పూర్తి వివరాలు వెల్లడించవలసిన అవసరం ఎంతైనా ఉందని అవినీతికి పాల్పడిన సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోని ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మైసమ్మ దేవాలయం, కూరగాయల మార్కేట్, ఆహ్లాదకరమైన పార్కు నిర్మాణాలు చేపట్టాలని పిర్యాదులో కోరినట్లు తెలిపారు.


0 Comments