తరతరాల చరిత్రకు ఆనవాళ్లు కోరుట్ల గడి బురుజులు స్థలాలను కాపాడుకుందాం - ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

 




తరతరాల చరిత్రకు ఆనవాళ్లు కోరుట్ల గడి బురుజులు స్థలాలను కాపాడుకుందాం - ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్


రోజురోజుకు పెరుగుతున్న మద్దతు – మూడవ రోజుకు చేరిన నిరసన దీక్షలు 


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 23 :

తరతరాల చరిత్రకు ఆనవాళ్లు కోరుట్ల గడి బురుజులు (గ్రామకంఠ / ఆబాది) స్థలాలు అని వాటిని కాపాడుకుందామని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. 

గురువారం కోరుట్ల అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్ష మూడవ రోజుకు చేరుకుంది. ఈ  దీక్షలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే  డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిబురుజుల భూములపై విధించిన విఎల్టీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఈ అంశాన్ని అజెండాగా తీసుకొని విఎల్టీలను రద్దు చేయడానికి కృషి చేస్తారని మిగతా కౌన్సిలర్లు కుడా ఈవిషయంలో మద్దతు ఇచ్చి కౌన్సిల్ సమావేశంలో విఎల్టీలను రద్దు చేయవచ్చు అని అన్నారు. గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిపై ఎలాంటి అక్రమాలు సహించబోమని ఎవరైనా చేసిన ఊరుకోమని  ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ నిరషన దీక్షకు కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ మరియు జమాత్-ఎ-ఇస్లామీ హింద్ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ ఖాన్  పలువురు పాత్రికేయులు, బిఆర్ఎస్ నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొని ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.


నిరసన దీక్షలో అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు చెన్న విశ్వనాథం , డాక్టర్ పేట భాస్కర్, ఎం డి ముజాహిద్, చింత భూమేశ్వర్, ఎం డి ముజీబుర్ రెహమాన్ , తుమ్మనపల్లి  శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్, పొతని శేఖర్, గొనే శంకర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Post a Comment

0 Comments