భవిష్యత్తు తరాల కొరకై కోరుట్ల గడి స్థలాలు సంరక్షిద్దామని చేతులు జోడించి వేడుకున్న.. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్


 భవిష్యత్తు తరాల కొరకై కోరుట్ల గడి స్థలాలు సంరక్షిద్దామని చేతులు జోడించి వేడుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ 


 యుద్ధంలో నేను వుంటాను పాత్రికేయులు, యువత, కుల సంఘాలు పాల్గొనాలని పిలుపు


ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 23:


అతి పురాతనమైన చారిత్రక కట్టడాలు కోరుట్ల కోట బురుజులు చాణుక్య జైన కాలం నాటి ఈ సంపదపై కొందరు రియాల్టర్లు కన్ను వేయడం దాన్ని అమ్ముకోవాలని చూడడం దుర్మార్గమైన చర్యగా ఖండిస్తున్నామని ఈ సంపద భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత సంరక్షించవలసిన అవసరం మనందరిపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు.


 గురువారం కోరుట్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్ల కోట బురుజుల స్థలాలలో నకిలీ దస్తవేదాలతో విఎల్టిలు వేయడం పూర్తి విరుద్ధమని దానికోసం కోరుట్ల అఖిలపక్ష ప్రజా సంఘాలు నిరసన దీక్షలు చేపట్టారని వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఆ యుద్ధంలో నేను ముందు వరసలో ఉంటానని పాత్రికేయులు సైతం భాగస్వాములు కావాలని యువత వివిధ కుల సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

 విఎల్టీలు రద్దు చేయాలంటే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం జరగాలని దానికి తమ ఎనిమిది మంది కౌన్సిలర్లు సంతకాలతో సిద్ధంగా ఉన్నారని మిగతా కౌన్సిలర్లు కూడా సంతకాలు చేస్తే విఎల్టీలు రద్దయితాయని పేర్కొన్నారు. ఈ అవినీతి వ్యవహారంలో చాలా పెద్ద తలకాయలు ముందుకు వస్తారని వారితో యుద్ధం చేస్తే తప్ప గడి స్థలాలు రక్షించుకోలేమని తమ ప్రభుత్వం వస్తే మాత్రం వీటన్నిటిని రద్దుచేసి ప్రజా ప్రయోజనాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. 

ఈ సమావేశంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లు, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments