కోరుట్ల గడి బురుజుల స్థలాల్లో అక్రమ విఎల్టీలపై తమ ఎమ్మెల్యేకు పార్టీ కి ఎలాంటి సంబంధం లేదు
అధికార కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తే విఎల్టీలు వెంటనే రద్దు అవుతాయి బిఆర్ఎస్ కౌన్సిలర్లు
ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల ప్రతినిధి, ఏప్రిల్ 22 :
కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.
బుదవారం రెండవ రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలిపారు . అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని ఈ అక్రమ విఎల్టీలపై కొందరు తమ ఎమ్మెల్యేను పార్టీని అనడం సరైంది కాదని తాము కోరుట్ల ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని అన్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తే గడి స్థలాలలో వేసిన విఎల్టీలు వెంటనే రద్దు అవుతాయి అని ఈ విషయంలో వారు గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై తమ పార్టీ మాట్లాడుతే కమీషనర్ గొంతు ఎత్తుకపోవడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమార్కుల నుండి కాపాడుకోవాలని అన్నారు.
గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. అక్రమంగా సృష్టించిన ఇంటి నెంబర్ల ఆధారంగా వేసిన VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.



0 Comments