శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న డాక్టర్ పేట భాస్కర్ ఫ్యామిలీ
ప్రజా దండోర న్యూస్ / వేములవాడ ప్రతినిధి :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ లోని శ్రీ రాజ రాజేశ్వర స్వామిని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రజా దండోర తెలుగు దినపత్రిక ఎడిటర్ డాక్టర్ పేట భాస్కర్ సుకన్య దంపతులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈమధ్యనే కొత్తగా పెళ్లయిన తమ కొడుకు కోడలు ప్రభాస్ విన్ - అను లతో కొడే మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం వేములవాడ దేవస్థానం పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భీమన్న దేవాలయంలో ఏర్పాటు చేసిన స్వామి వారిని దర్శించుకొన్న పేట భాస్కర్ మాట్లాడుతూ నూతన దేవాలయం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అత్యద్భుత నిర్మాణంతో లక్షలాదిమంది భక్తుల ఇలవేల్పు అయిన రాజన్న దేవాలయం భవిష్యత్తులో కన్నులపండువగా కానుందని తెలిపారు. తమ కుటుంబ సభ్యులతో పాటు కూతురు అల్లుడు బొల్లారం సుభాషిణి - అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.


0 Comments