హైదరాబాద్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

 


హైదరాబాద్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్


ప్రజాదండోర న్యూస్ / జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి  :


హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర జ్వరంతో యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ హాస్పిటల్‌కు వెళ్లి మంత్రివర్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా డా. సంజయ్ కుమార్ మంత్రివర్యుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి త్వరగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

అదే విధంగా, మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటూ ఆయనకు ధైర్యం చెప్పారు. ప్రస్తుతం మంత్రివర్యులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

Post a Comment

0 Comments