ఎస్సీ వర్గాల సంక్షేమం వారికి సామాజిక న్యాయం అమలు చేయడమే ప్రధాన లక్ష్యం
- పిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్పర్సన్ గా గురువారం అంగరంగ వైభవంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో టి పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రులు, పార్టీ పెద్దలు, అభిమానుల సమక్షంలో బాధ్యతలు చేపట్టిన మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి సామాజిక న్యాయం కోసం అవిరామంగా కృషి చేస్తున్న తనకు ఇంతే గొప్ప బాధ్యత అప్పగించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ విభాగం చైర్ పర్సన్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ పదవీ స్వీకరణ మహోత్సవం సందర్భంగా, డా.కవ్వంపల్లి సత్యనారాయణ మొదటగా హైదరాబాద్ నగరం లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, భక్తిపూర్వకమైన నివాళులు అర్పించారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సామాజిక సమానత్వం, దళితుల ఉద్ధరణ, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాట స్ఫూర్తికి చెల్లించిన హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డా. సత్యనారాయణ తమ నాయకత్వ ప్రయాణాన్ని అంబేద్కర్ ఆశయాలతో ముడిపెట్టి మొదలుపెట్టారని, ఎస్సీ సమాజ సంక్షేమం, సామాజిక న్యాయం అమలు చేయడమే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మందుల శ్యామెల్, వేముల వీరేశం, గడ్డం వినోద్, తోట లక్ష్మీకాంత రావు, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ ప్రీతం, వివిధ సంస్థల చైర్మెన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.


0 Comments