అనుమానంతో భార్యను అతి కిరాతంగా హత్య చేసిన భర్త
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల నియోజకవర్గ ప్రతినిధి :
జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య సతవ్వను అనుమానంతో భర్త మల్లయ్య గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అంతటితో ఆగకుండా మృతదేహాన్ని అవమానపరిచేలా వికృత చేష్టలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర సంచలనం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటన అనంతరం నిందితుడు మల్లయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

0 Comments