జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ప్రజాదండోర దినపత్రిక నియోజకవర్గ ఇంచార్జి సురేష్
జగిత్యాల నియోజకవర్గం ప్రజాదండోర తెలుగు దినపత్రిక ఇంచార్జ్‌గా కొడిపెల్లి సురేష్ నియామకమైన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ ను అభినందిస్తు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయ ధోరణి కొనసాగించాలని ఆకాంక్షించారు.
కొడిపెల్లి సురేష్‌తో పాటు తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ ఏలేటి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

0 Comments