జగిత్యాల మున్సిపల్ పరిధిలో పోలింగ్ స్టేషన్‌లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.
ప్రజాదండోర న్యూస్ / సురేష్ కొడిపెల్లి / జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి :
జగిత్యాల మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్‌లను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ తీరును, ఓటర్లకు అందుతున్న సౌకర్యాలను, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదని, అధికారులు మరియు సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లతో విధులు నిర్వర్తిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, కూర్చోవడానికి సౌకర్యం, షేడ్లు తదితర సదుపాయాలు కల్పించాలన్నారు.
అలాగే ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తవుతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


0 Comments