జిల్లా పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్




జిల్లా పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ 

ప్రజా దండోర న్యూస్  /  జగిత్యాల జిల్లా ప్రతినిధి : 

జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో  నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లా ఎస్పీ వివిధ ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారుల కు మరియు సిబ్బందికి ఎస్పీ గారు భద్రత పరమైన పలు సూచనలు చేశారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచనలు చేశారు.

ఎస్పీ వెంట డీఎస్పీ రఘు చందర్,  ఇన్స్పెక్టర్ లు కరుణాకర్, రవి, మరియు ఎస్. ఐ లు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Post a Comment

0 Comments