జగిత్యాల జిల్లాలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల యుద్ధం

 


జగిత్యాల జిల్లాలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల యుద్ధం  

వార్డుల వారిగా విస్తృతంగా ఆయా పార్టీల నాయకుల ప్రచారం

ప్రజా దండోర ప్రతినిధి /  పేట ప్రభాస్ :

 జిల్లాలోని జగిత్యాల,  కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది నిన్నటి వరకు బిఫామ్ లు వస్తాయా రావా అనే సందిగ్ధంలో వున్న ఆయా పార్టీల అభ్యర్థులు బిఫామ్ ల ప్రక్రియ నిన్నటితో ముగియడంతో టికెట్లు లభించిన ఆయా పార్టీల అభ్యర్థులు మరింత ఉత్సాహంగా నేటి నుండి ప్రచార రథాలతో యుద్ధానికి సిద్ధమంటు ప్రచారం కొనసాగిస్తున్నారు. టికెట్ దక్కని వారు సైతం ఇండిపెండెంట్ అభ్యర్థులు గా బరిలో నిలిచి తమ సత్తా ఎంటో చూపుతామని ప్రజల మనసు గెలుచుకుంటామనే ధీమాలో ఉత్సాహంగా యుద్ధం కు సిద్ధమయ్యారు. 

తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ఇంచార్జీలు  వార్డుల వారీగా ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ భవిష్యత్తులో ప్రజల కోసం చేసే పనులను గతంలో చేసిన పనులను వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా ముందుకు వెళ్తున్నారు. 

ప్రధాన పార్టీలతో పాటు నూతనంగా ఏర్పాడ్డ పార్టీలు వారి అభ్యర్థులు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు ధీమాలో వారు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఇప్పటినుండే ఖర్చులకు వెనుకాడకుండా తమ బలాబలాలు చూపించుకునేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేస్తు వార్డుల వారిగా ప్రచారం, కార్నర్ మీటింగ్ లతో  కోలాహలంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

Post a Comment

0 Comments