దరూర్ ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

 


దరూర్ ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజా దండోర న్యూస్ / సురేష్ కొడిపల్లి  / జగిత్యాల ప్రతినిధి :

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం దరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ప్రతి నెలా ఈవీఎంలను తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గోదాం వద్ద ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తంగా పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు, కలెక్టరేట్ ఏవో హకీమ్, ఎలెక్షన్ సూపరింటెండెంట్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments