మహా శివరాత్రి వేడుకల్లో దుబ్బ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పించిన జిల్లా కలెక్టర్
ప్రజా దండోర న్యూస్ / సురేష్ కొడిపెల్లి / జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ :
శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కలెక్టర్ దంపతులు భక్తి పరవశంతో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ చర్యలు నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని సూచించారు.
మహా శివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.



0 Comments