ఆత్మాభిమాన చైతన్య వేదిక మాదిగ మహాశక్తి -ఎమ్మేల్యే కవ్వంపల్లి, మాజీ మంత్రి మోత్కుపల్లి
ప్రజా దండోర న్యూస్ / స్టేట్ బ్యురో / బత్తుల శంకర్ :
రాజ్యాంగ పరిరక్షణ కోసం మాదిగల ఆత్మాభిమాన చైతన్య కదలికే లక్ష్యంగా ఉద్యమించాలని పిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండుర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు.
శనివారం కరీంనగర్ ప్రతిమ మల్టీ ఫ్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అధ్యక్షతన జరిగిన ఉమ్మడి జిల్లా మాదిగ మహా శక్తి సదస్సులో పాల్గొన్న వక్తలు సుదీర్ఘ ప్రసంగం చేశారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ మహాశక్తిని విడగొట్టి పాలించే ధనిక రాజకీయ అధికారాలను ఎదిరించి జనాభా తమాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన అధికారాన్ని సాధించేందుకు కట్టుబడి ఉండాలనే సంకల్పంతో మాదిగ మహాశక్తి సంగ్రామం మొదలైందని దీనిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ ఉద్యమం తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి చైతన్య పరుస్తామని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున మాదిగ విద్యా వంతులు, మేధావులు, వివిధ పార్టీల నాయకులు, సింగరేణి మరియు మాదిగ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.


0 Comments