ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :
జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరెట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న స్వాతంత్ర్య సమర యోధులు వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ , అదనపు కలెక్టర్ రాజా గౌడ్ ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు వల్లెపు మొగిలి, వడ్డెర నాయకులు బాపి రాజు, గంగాధర్, మల్లేశం, నక్కల కప్పల శ్రీకాంత్, ప్రవీణ్, వడ్డెర సంఘం నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments