స్వామీ వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకం జగిత్యాల ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి :

జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్ నాయకులు గట్టు సతీష్, బోడ్ల జగదీష్, పిప్పరి అనిత, పోతునుక మహేష్, రాజగోపాల చారి, కౌన్సిలర్ లు, నాయకులు, యువకులుమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments