మంత్రి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రజాదండోర న్యూస్ / పేట ప్రభాస్ / కోరుట్ల ప్రతినిధి: నేడు తేదీ: 24/01/ 2026 శనివారం సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్లలో పర్యటించనున్నారు. వారితో పాటు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు, జువ్వాడి కృష్ణారావులు పాల్గొంటారు. పట్టణంలోని పలు వార్డు లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని అనంతరం కావేరి గార్డెన్ లో జరిగే పావలా వడ్డీ రుణమాఫీ చెక్కులను పంపిణీ చేస్తారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తెలిపారు.

0 Comments