భీరయ్య ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల పట్టణ కుర్మ సంఘ నాయకులు సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం బీరయ్య ఆలయ అభివృద్ధికి 5 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోరే గంగమల్లు ,అధ్యక్షులు పుల్ల మల్లయ్య, కార్యదర్శి మహేష్, కోశాధికారి పోచమల్లయ్య గట్టు రాజు, మల్లికార్జున్, డిష్ ప్రసాద్ , కురుమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments