ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఐపీఎస్


-సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి
- అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి

ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి :

సంక్రాంతి పండగ దృష్ట్యా చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.
ఊరికి వెళ్లే వారు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట లేదా బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం అని రాత్రి వేళల్లో గస్తీ ని ముమ్మరo చేశామని ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోని పోలీసు వారికి సహకరించాలని కోరారు.

దొంగతనాలు దృష్ట్యా పోలీస్ శాఖ వారి పలు సూచనలు

👉 ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది.

👉 ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది.

👉 విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు.

👉 బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు.

👉 ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

👉 రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలి.

👉 అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.

👉 మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు అమార్చుకోవాలి.

👉 చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

👉 ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి.

Post a Comment

0 Comments