మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి - పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

 

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి - పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు

- అభివృద్ధి పనులు కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మంత్రులు ఉత్తమ్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్

డా. పేట భాస్కర్, ఎడిటర్ /ప్రజా దండోర న్యూస్ :

కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని కావేరి గార్డెన్ లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథులుగా మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమారులు హాజరయ్యారు. ఈసందర్భంగా వారిని నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగ్ రావు పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు.

అనంతరం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమైన వారికే టికెట్లు దక్కుతాయి అన్నారు. టికెట్ రానివారు అధైర్యపడవద్దని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదల కోసమని సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహిళాలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు వంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. టికెట్ దక్కని అభ్యర్థులు నిరుత్సాహ పడవద్దు అన్నారు రాబోయే మున్సిపల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కోరుట్ల మున్సిపల్ లో చాలా సమస్యలు అభివృద్ధికి నోచుకే లేదని వాటిని ఎన్నికల తరువాత తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు అనంతరం జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో కోరుట్ల, మేట్పల్లి మున్సిపల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేలా కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు కోరారు. 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య , రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి విజయ్ అజాద్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఎఎంసి చైర్మన్ అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం వేణుగోపాల్, అన్నం లావణ్య అనీల్, నాయకులు అల్లూరు మహేందర్రెడ్డి, కొంతం రాజం, అనిల్ మరియు పెద్ద ఎత్తున టికేట్ ఆశిస్తున్న ఆశావాహులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments