కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక మెరిటోరియస్ సర్వీస్ మెడల్ ( ఎమ్ ఎస్ ఎమ్) ఎఎస్సై ఆనందం ఎంపికను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల జిల్లా ప్రతినిధి:
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎఎస్సై ఆనందం కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెరిటోరియస్ సర్వీస్ మెడల్ ( ఎమ్ ఎస్ ఎమ్ ) కు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.
విధి నిర్వహణలో భాగంగా నిబద్ధతతో, కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు ఇలాంటి గుర్తింపు లభించడం ఇతర సిబ్బందికి ప్రేరణగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 మంది పోలీస్ అధికారులకు ఈ మెడల్ లభించగా, అందులో జగిత్యాల జిల్లా నుంచి ఎఎస్సై ఆనందం ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు.
ఎఎస్సై ఆనందం 1989 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి, 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ఎఎస్సై పదోన్నతి పొందారు. తన సుదీర్ఘ సేవా కాలంలో 2012లో రాష్ట్ర పోలీస్ సేవా పథకం, అలాగే 2018లో ఉత్తమ సేవా పథకం కు ఎంపికయ్యారు.
37 సంవత్సరాల పాటు ఎలాంటి రిమార్క్ లేకుండా, అంకితభావంతో పోలీస్ శాఖకు చేసిన విశేష సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక మెడల్‌కు ఎంపిక చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఎఎస్సై ఆనందం ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరింత ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

0 Comments