గణతంత్ర వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ను గౌరవించుకోవాలి

 


గణతంత్ర వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబా సాహేబ్ బిఆర్ అంబేద్కర్ ను గౌరవించుకోవాలి

డా. పేట భాస్కర్, ఎడిటర్ / ప్రజా దండోర న్యూస్ :

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా  కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో  డా. బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామ సర్పంచ్ గోకల సుమలత రంజిత్ పూల మాలతో నివాళ్లు అర్పించి సేవలను స్మరించారు. 

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలన్నారు.  ప్రతి ఆదివారం జరిగే ఈకార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందిని రేపు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ జరుగు ప్రతి దగ్గర ప్రపంచం మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న  డాక్టర్ బిఆర్ అంబేద్కర్  చిత్రపటం ఉంచి వారిని గౌరవించుకోవాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో తక్కళ్ళ దేవయ్య మట్టిపూలు పత్రిక సంపాదకులు, ఆనంతుల కాంతారావు తెలంగాణ శక్తి ఎడిటర్, కాయితి శ్రీనివాస్ అధ్యక్షులు జిల్లా ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం,కంటె అంజయ్య ప్రధాన కార్యదర్శి పట్టన రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం,బొంకంటి రవి, బొల్లం ప్రభాకర్, దాసరి లచ్చయ్య, మాజీ సర్పంచ్ రుద్ర మనోహర్, సుంకరిపల్లి అశోక్, సంకె మహేష్, నల్ల సురేష్, దార శేఖర్, దార గంగాధర్, దార తిరుపతి, బత్తుల రాజేందర్, మూగల జలందర్,మూగల నిఖిల్, మేదిని రవి, మేదిని శాంతయ్య, మేదిని రాశేఖర్, రొండి రాజేష్, అచ్చ నారాయణ, గోకల సురేష్, గోకల పర్శరాములు, శ్రీపతి దామోదర్, దాసరి ప్రవీణ్,కొల్లూరి సురేందర్, దుమాల గంగాధర్ మరియు  అంబేద్కర్ వాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments