ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా "రిపబ్లిక్ డే" వేడుకలు
ప్రజా దండోర న్యూస్ / మెట్ పల్లి ప్రతినిధి ;
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 77వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.వేంకయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ వేడుకలు వందేమాతరం గీతంతో ప్రారంభమై, జాతీయ గీతం ఆలపించి,ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య , వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్ ఓ డి మనోజ్ కుమార్ లతో పాటు బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొని,ప్రసంగించారు.


0 Comments