కోరుట్ల గడి బురుజు స్థలాలు కాపాడే వరకు పోరాటం ఆగదు - ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్



కోరుట్ల గడి బురుజు స్థలాలు కాపాడే వరకు పోరాటం ఆగదు - ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 

ప్రజా దండోర న్యూస్ / కోరుట్ల 

కోరుట్ల పట్టణంలో చారిత్రక గుర్తింపుగా నిలిచిన గడి బురుజుల స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు..


బుధవారం కోరుట్ల గడి బురుజు స్థలంలో  ఏర్పాటు చేసిన భారీ నిరసన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు గుడి బురుజుల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారనే అంశంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ, ప్రజల ఆస్తులను కాపాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. గడి బురుజు స్థలానికి సంబంధించిన VLT రద్దు అయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీ గా బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇకనైన గడీ బురుజుల వీఎల్టిల రద్దు చేయించేలా మున్సిపల్ పాలక పక్షంకు కనువిప్పు కలిగలని అంబేద్కర్ ను వేడుకున్నారు. 

అనంతరం గుడి బురుజు స్థలంలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ‍ స్థల వ్యవహారంలో తమ పార్టీకి చెందిన నాయకులు లేదా కార్యకర్తల ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 

పార్టీకి చెందిన వారైనా సరే, ప్రజా ఆస్తుల పరిరక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు…

ప్రజలకు చెందాల్సిన ఆస్తుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని, గడి బురుజు స్థలాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

గడి బురుజు స్థల పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటం ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్  స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో పట్టణంలోని కుల, ప్రజా సంఘాలు, బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Post a Comment

0 Comments