రాష్ట్ర వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు ప్రమాణ స్వీకారం
మైత్రీవనంలో పదవీ బాధ్యతల స్వీకారం.. ఘనంగా ఆత్మీయ సన్మానం
హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. భారీగా తరలివచ్చిన కోరుట్ల కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు
ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్, నవంబర్ 07:
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. శనివారం హైదరాబాద్‌లోని మైత్రీవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు, జువ్వాడి సోదరులు కృష్ణారావు, శేఖర్‌రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. వారి సమక్షంలో జువ్వాడి నర్సింగరావు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఘనంగా ఆత్మీయ సమ్మేళనం.. జువ్వాడికి సన్మానం
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం హకీంపేటలోని జుపల్లి బాలమ్మ వెలమ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో జువ్వాడి నర్సింగరావుకు ఘనంగా సన్మానం నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వెలమ సంఘ సభ్యులు, అభిమానులు, పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావుకు ప్రత్యేక గజమాలతో ఘనంగా సన్మానించారు. పలువురు నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆయనకు రాష్ట్రస్థాయి కీలక బాధ్యతలు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
భారీగా తరలివచ్చిన కోరుట్ల కాంగ్రెస్ శ్రేణులు
ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాయకులు జేఎన్ వెంకట్, ఆకుల లింగారెడ్డి, ఆనంద్ గౌడ్, అన్నం అనిల్, అడేపు మధు, పుప్పాల ప్రభాకర్, నర్సయ్య, స్వామి, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షుడు పన్నాల అంజిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర శేఖర్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ధర్మారం సర్పంచ్ దూడ రంజిత్, గ్రామ సర్పంచులు ధ్యాగ గంగాధర్, సరికెళ్ల లతికా నరేష్, ఎం.డి. రహీం, నాయకులు పల్లపు అశోక్, ఏలేటి శశిందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్. రాజయ్య, రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర వెలమ కార్పొరేషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జువ్వాడి నర్సింగరావుకు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.



0 Comments