ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

 


ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ 


ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి, ఆగస్టు 25:


 హైదరాబాద్‌లోని మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ముందు తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు అండగా నిలిచి, వారితో కలిసి ధర్నాలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదని అన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు అందించిన సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.

ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు..


సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆశా వర్కర్ల హక్కుల కోసం వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments