కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన జువ్వాడి నర్సింగరావు


కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన జువ్వాడి నర్సింగరావు 


ప్రజా దండోర న్యూస్ / హైదరాబాద్ ప్రతినిధి, ఆగస్టు 25:


హైదరాబాదులోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈసందర్భంగా  కోరుట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఇందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు జువ్వాడి నర్సింగరావు తెలిపారు. అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు జువ్వాడి నర్సింగరావు తెలిపారు.

Post a Comment

0 Comments