జగిత్యాల జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన..
ప్రజా దండోర న్యూస్ / జగిత్యాల, ఆగష్టు 20
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఆగస్టు 21, 2026న జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల జిల్లాకు చేరుకొని ధరూర్ క్యాంప్, జగిత్యాల జిల్లా లో నూతనంగా మంజూరైన *జగిత్యాల, మెట్‌పల్లి రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలకు శంకుస్థాపన* చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి చేరుకుని, మధ్యాహ్నం 1:00 గంటల నుంచి 1:30 గంటల వరకు కాలనీని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు.
మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 4:30 గంటల వరకు జగిత్యాలలోని *పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం* నిర్వహించనున్నారు.
సాయంత్రం 4:30 గంటల నుంచి 7:00 గంటల వరకు *ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం* నిర్వహించనున్నారు.
మంత్రి పర్యటన సందర్భంగా సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

0 Comments